English   

రేటు డబుల్ చేసిన హిట్ డైరెక్టర్ !

Anil-Ravipudi
2019-03-16 17:06:58

రచయితగా కెరీర్ మొదలెట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాలు హిట్టయి కూర్చున్నాయి.  దాంతో అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. కుర దర్శకుల్లో ఆయనను మించిన వాళ్లే లేరు ఇప్పుడు. ప్రస్తుతం మహేష్ బాబు కోసం ఒక కథ సిద్ధం చేసి ఆయనతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దీని కోసం మహేష్ బాబు ఏకంగా 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. క్యాష్ రూపంలో కాకుండా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను తనకు ఇచ్చేయమని అడుగుతున్నాడు మహేష్. దీనికి నిర్మాతలు కూడా ఓకే చెప్పడంతో మహేష్ బాబు రికార్డు రెమ్యూనరేషన్ తీసుకోవడం ఖాయం అయిపోయింది. జూన్ నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. ఇందులో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని, ఇది కూడా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి కూడా రికార్డు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈయన గత సినిమా f2 కోసం నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే, ఇప్పుడు మహేష్ బాబు కోసం ఏకంగా 9 కోట్లు తీసుకుంటున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ట్రాక్ రికార్డు తెలుసు కాబట్టి అనిల్ రావిపూడికి అంత ఇవ్వడంలో తప్పులేదని అంటున్నారు విశ్లేషకులు. సక్సెస్ లో ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనకేసుకోవాల ఒక్క ఫ్లాప్ వచ్చింది అంటే పట్టించుకునే వారు కూడా ఉండరు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే అనిల్ రావిపూడి తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మహేష్ బాబు సినిమా హిట్ అయిందంటే ఈయనను ఆపేవాళ్ళు ఎవరూ ఉండరు.

More Related Stories