English   

అమ్మాయిని అయిపోయాను కానీ...లేకపోతే తమన్నాని ?

Shruti-Haasan
2019-03-16 17:33:20

నేను అమ్మాయిని అయిపోయాను కానీ ఒకవేళ అబ్బాయి ఉంటే మాత్రం తమన్నాని పెళ్లి చేసుకునే దాన్ని ! ఓర్నీ ఇంత హాట్ కామెంటా ? చేసింది ఎవరా అనుకుంటున్నారా. ఇప్పుడు ఇంత సంచలన కామెంట్ చేసింది ఎవరో కాదు శృతిహాసన్. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, సినిమా వాళ్లకు దగ్గరగానే ఉంది. ప్రైవేట్ పార్టీలు చేసుకుంటూ ఫుల్ గా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాను మానసికంగా చాలా ఉల్లాసంగా ఉన్నాను అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శృతిహాసన్. ఇక తాజాగా తమన్నాతో తనకున్న స్నేహం గురించి కాస్త ఆసక్తికరంగా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తమన్నాతో తనకు చాలా రోజులనుంచి పరిచయం ఉందని ఆమె ఎవరిని అంత తేలిగ్గా వదులుకోదని ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటుందని చెప్పింది శృతిహాసన్. తాను అమ్మాయిని అయిపోయాని కానీ ఒకవేళ అబ్బాయి అయి ఉంటే మాత్రం కచ్చితంగా తమన్నాతో డేటింగ్ చేసేదాన్ని కుదిరితే పెళ్లి కూడా చేసుకునేదాన్ని అంటోంది శృతిహాసన్. వీళ్ళిద్దరికీ చాలా సంవత్సరాలుగా మంచి స్నేహం ఉంది. మహేష్ బాబు హీరోగా వచ్చిన ఆగడు సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తే శృతిహాసన్ ఐటమ్ సాంగ్ చేసింది. దానికి ముందు నుంచి కూడా ఇద్దరు ముద్దుగుమ్మలు మధ్య మంచి స్నేహం ఉంది. మొత్తానికి తాను అబ్బాయిని అయితే తమన్నాను పెళ్లి చేసుకుంటాను, అసలు వదిలిపెట్టను అనే మాట వాడింది అంటే తమన్నాపై శృతి హాసన్ ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇందులో వారిద్దరి స్నేహం కూడా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ రీ ఎంట్రీ కోసం మంచి కథ వస్తే చేద్దామని ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో తమన్నా మాత్రం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

More Related Stories