English   

సెంటిమెంట్ వర్కౌట్ అయితే మజిలీ హిట్టే !

Naga-Chaitanya
2019-03-16 10:37:47

వివాహ బంధంతో ఒక్కటయ్యాక నాగ చైతన్య-సమంతాలు కలిసి నటిస్తున్న సినిమా మజిలీ. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ గా, సమంతా రైల్వే క్లర్క్ గా అదే విధంగా భార్యా భర్తలుగా కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్ పూర్తి చేసుకున్నట్టు హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు వారు అందరూ ప్రమోషన్స్ మీద ద్రుష్టి పెట్టారు. వైజాగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎన్నికలకి వారం ముందు అంటే ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. నిజానికి నాగ చైతన్యకి మాస్ సినిమాలు కలిసి రాలేదు. ముందు నుండీ లవర్ బాయ్‌ గా ముద్ర పడడంతో ఆఉఅన మార్కెట్‌లో మాస్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవడం కోసం ఎంత ప్రయత్నించినా బెడిసి కొట్టడమే తప్ప ఒక్కటీ హిట్ అందుకోలేదు. ఇది మాస్ సినిమా కాకపోవడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందనే భావిస్తున్నారు మేకర్స్. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories