English   

అనుష్క‌ సైలెన్స్ వీడుతుందట !

Anushka
2019-03-16 10:47:54

బాహుబలి సినిమా తర్వాత భాగమతి సినిమా చేసిన అనుష్క తన నటనా జీవితానికి చాలా గ్యాప్ ఇచ్చింది. ఎంత గ్యాప్ ఇచ్చిందో అంతా ఓకే సారి కవర్ చేసేయడానికా అన్నట్టు ఆమె ఒక ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ ఒప్పుకుంది. అదే హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వస్తున్న సైలెన్స్ అనే సినిమా. ఈ సినిమా గురించి ముందు నుండి అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని, మాధవన్ నటిస్తారని, అలాగే హాలీవుడ్ యాక్టర్ నటిస్తారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నిజం చేస్తూ గతంలో సహా నిర్మాత కోన వెంకట్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ వచ్చింది, అదేంటంటే ఈ సినిమా రానున్న ఏప్రిల్ నెల నుండి షూట్ జరుపుకోనుందట. ఇక ఈ సినిమాలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవ‌స‌రాల శ్రీనివాస్ తో పాటుగా  దాదాపు 100కి పైగా హాలీవుడ్ సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ మొదటి సారిగా ఒక ఇండియ‌న్ మూవీలో అదీ సైలెన్స్ మూవీ న‌టిస్తున్నారు. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో కూడా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థ‌తో క‌లిసి నిర్మిస్తోంది.
 

More Related Stories