English   

అవును వారిద్దరికీ నిశ్చితార్ధం అయింది !

Vishal
2019-03-16 10:52:42

తమిళ హీరో విశాల్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో తన పెళ్లి మీద వస్తున్న ఊహాజనిత వార్తలకి బ్రేక్ వేస్తూ తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్‌. హైదరాబాద్‌ కు చెందిన ఒక వ్యాపార వేత్త కుమార్తె అయిన అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు లాంటి సినిమాల్లో నటించిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరుపుకున్నారు. పెళ్లి కూడా ఈ ఏడాది ఆగష్టులో కానీ సెప్టెంబర్ లో కానీ జరగనుందట. అయితే ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్ష్యుడిగా వ్యవహరిస్తున్న విశాల్ ఆ సంఘం కోసం శాశ్వత భవనం కోసం శపధం పూనాడు. ఆ సంఘానికి శాశ్వత భవనం కట్టించాకే అందులో పెళ్లి చేసుకుంటానని ఆయన శపధం చేశాడు. ఆ పనులు ఆగష్టులోపు పూర్తి కావొచ్చని అంటున్నారు. విశాల్‌ ప్రస్తుతం టెంపర్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories