English   

డియర్ కామ్రేడ్ టీజర్ తో వస్తున్నాడట !

Dear-Comrade
2019-03-16 18:34:08

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన రెండవ మారు జంటగా నటిస్తున్న చిత్రం డియర్‌ కామ్రేడ్‌. డెబ్యూ దర్శకుడు భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మెడికల్ కాలేజ్ నేపద్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇటీవలే రిలీజయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ లో రష్మిక విజయ్‌ను హత్తుకున్నట్లుగా ఉంది. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే రేపు ఈ సినిమా టీజర్  రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ఫస్ట్ లుక్ రిలీజ్ అప్పుడే ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. నిజానికి గత ఏడాది రెండు ఫ్లప్స్ తో ఇబ్బంది పడుతున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారికి ఇది బాగా కలిసొచ్చే అంశం. అర్జున్ రెడ్డి క్రేజ్ తో నాలుగు భాషల డిజిటెల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యయట. అంతే కాదు విజయ్ మేనమామ యష్ రంగినేని ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

More Related Stories