English   

మియా ఖలీఫాకి త్వరలో పెళ్లట !

Mia-Khalifa
2019-03-16 11:56:05

మియా ఖలిఫా ! అంటే ఇదేదో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలాగా ఏదైనా బిల్డింగ్ అనుకోకండి ఇది ఒకప్పటి టాప్ పోర్న్ స్టార్ పేరు. ఈమె యూత్‌ అందరికీ సుపరిచితమే. ఈ మధ్య కూడా ఈమె వార్తల్లోకి ఎక్కింది. మీరకు గుర్తుందో లేదో ఒక పోర్న్ స్టార్ పుట్టినరోజుకి కేరళలో కుర్రాళ్ళు బ్యానర్ కట్టారే...అది ఈ అమ్మడి బ్యానరే. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే తాజాగా ఈ భామ ఎంగేజ్మెంట్ చేసుకుంది. అమెరికాలో నివసించే అరబ్ సంతతి యువతీ అయిన ఈమె అప్పట్లో పోర్న్ స్టార్ గా దుమ్ము రేపిందని చెబుతారు. తర్వాతి కాలంలో ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి కొన్నాళ్ళు యూట్యూబ్ చానల్ నడిపింది, అందులో స్పోర్ట్ కామెంటర్ గా పనిచేసింది. ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ మొదలెట్టింది. ఈ క్రమంలో తనకు పరిచయం అయిన రాబర్ట్ శాండ్ బర్గ్ అనే టాప్ రేటెడ్ చెఫ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ గత కొంత కాలంగా లివిన్ లో కూడా ఉన్నారు. అయితే తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఇరువురూ సోషల్ మీడియాలో వివరాలు షేర్ చేసుకున్నారు. 
 

More Related Stories