English   

త్వరలో కడపలో ఎన్టీఆర్‌ నైట్‌ - వెన్నుపోటు

Ram Gopal Varma Lakshmis Ntr Audio Release Event In Kadapa
2019-03-16 18:58:42

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో రోజుకొక వివాదం సృష్టిస్తున్న వర్మ మరో బాంబు పేల్చాడు. ఆ సినిమా ఆడియో రిలీజ్ ను కడపలో విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్ గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇంకా రిలీజ్ డేట్ ని కన్ఫాం చేయని వర్మ ఆ ఆడియో రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నాడు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్  ఆడియో రిలీజు ఈవెంట్   కడప లో ఒక  గొప్ప  బహిరంగ  సభలో  చెయ్యబడుతుంది   ..ఈవెంట్  పేరు “వెన్ను  పోటు” అలియాస్  ఎన్టీఆర్  నైట్.
ఈవెంట్ డేటు  అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది  ..
జై ఎన్టీఆర్ #LakshmiNTR అని ఆయన ట్వీట్ చేశారు.
నిజానికి ఈ సినిమా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్టు ట్రైలర్ టీజర్స్ ని బట్టి అర్ధం అవుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెబుతున్నా ఎక్కువగా బాబునే మైనస్ గా చూపించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు మంజుతో కలిసి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఎన్నికల ముంగిట ఈ సినిమా ఎన్ని సంచలనాలకి కారణం అవుతుందో వేచి చూడాలి.

More Related Stories