English   

సైరాలో అమితాబ్ పార్ట్ పూర్తయ్యిందట !

Amitabh-Bachchan
2019-03-16 12:20:27

తెలుగు వారు గర్వంగా చెప్పుకునే స్వాతంత్ర్య సమరయోదుల్లో రాయల సీమ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని సైరా నరసింహా రెడ్డి అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి నరసింహా రెడ్డిగా నటిస్తుండగా ఆయనకు జోడీగా నయనతార. ఆయనకు గురువుగా అమితాబ్ బచ్చన్, మిగిలిన మరికొన్ని ముఖ్య పాత్రల్లో విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, తమన్నా లాంటి వారు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నరసింహా రెడ్డి గురువు గోశాయి వెంకన్న పాత్ర పోషిస్తున్న అమితాబ్ షూట్ ఈరోజుతో పూర్తయ్యిందట. ఈ నేపధ్యంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిగ్‌బీకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఆయనతో జర్నీ అద్బుతం, అది వర్ణించలేనిది. సార్ సైరాలో భాగమైనందుకు థ్యాంక్స్. మీతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం దక్కిందని భావిస్తున్నానని చెబుతూ ఆయనతో దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది రెండవ భాగంలో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.

More Related Stories