English   

సూపర్ స్టార్ అనిపించుకున్న మహేష్ !

Mahesh Babu fulfills dreams of a his child fan
2019-03-16 12:54:49

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన బిరుదుని సార్ధక నామధేయంగా చేసుకున్నాడు. చిన్నారులు అంటే మక్కువ చూపే మహేష్ ఎప్పుడూ తన కొడుకూ కూతురుతోనే తన ఖాళీ సమయాన్ని గడుపుతూ ఉంటాడు. తాజాగా మహేష్ బాబు తన మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని ఐన ఒక బాలిక కోరికను తీర్చాడు. శ్రీకాకుళానికి చెందిన పర్విన్ బైబి అనే చిన్నారికి మహేష్ బాబు అంటే ఎనలేని అభిమానం. అయితే ఆమె ప్రస్తుతం క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమె తాను ఎంతో ఇష్టపడే హీరో మహేష్ బాబును చూడడమే తన చిరకాల కోరికని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయాన్ని మహేష్ అభిమాన సంఘం ద్వారా మహేష్ కి విషయం తెలియడంతో వెంటనే మహేష్ ఆ పాపను కలిసేందుకు ఓకే చెప్పాడు. ఈరోజు శ్రీకాకాళంలోని చిన్నారి ఇంటికి వెళ్లి కలిసిన మహేష్ చిన్నారితో ఫోటోలు దిగి కాసేపు ఆమెతో సమయం గడిపాడు. తన అభిమాన నటుడు తన కోసం తన ఇంటికి రావడంతో ఆ చిన్నారి ఆనంద పడి ఉంటుంది. ఆ చిన్నారి త్వరగా క్యాన్సర్ నుండి కోలుకోవాలని కోరుకుందాం.

More Related Stories