English   

జన‌సైనికురాలిగా మారిపోయిన మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌..

Niharika Konidela Requesting to Vote for Pawan Kalyan's Janasena
2019-03-16 13:36:51

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మెగా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. పైకి కనిపించడానికి ఎవరూ పవన్ కళ్యాణ్ కోసం రావడం లేదు.. కానీ లోలోపల మాత్రం అందరం జనసేనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యుడి పార్టీ కోసం తమ వంతుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ బయటికి ఎక్కడికి వ‌చ్చినా కూడా గ్లాస్ గుర్తును గుర్తు పెట్టుకోండి అంటూ అభిమానులకు చెబుతున్నాడు. ఇక అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు కూడా జనసేన పార్టీకి పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో నిహారిక కూడా చేరిపోయింది.
ఈమె ప్రస్తుతం సూర్యకాంతం సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని కాలేజీలకు తిరిగి సూర్యకాంతం సినిమా ప్రమోషన్ చేస్తుంది. అందులో భాగంగా విద్యార్థులను కలిసినప్పుడు ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అని అడిగి.. జనసేన పార్టీకి వేయండి.. మార్పు వస్తుంది అంటూ ప్రచారం చేస్తుంది ఈ మెగా వారసురాలు. బాబాయ్ కోసం తన వంతు ప్రచారం చేస్తూ జనసైనికురాలిగా మారిపోయింది నిహారిక కొణిదెల. మరి ఈమె ప్రచారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి ఎంతవరకు పనికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories