English   

పద్మ శ్రీ అందుకున్న సిరివెన్నెల !

Padma Awards 2019 Sirivennela Seetharama Sastry honoured by President Ram Nath Kovind
2019-03-16 21:00:20

తను పాటలు రాసిన మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న టాలీవుడ్ దిగ్గజ పాటల రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రి. తాజాగా ఆయన పద్మశ్రీ అవార్డుకు ఎంపికయిన సంగతి తెలిసిందే. ఆయన ఈ రోజు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రామ్‌నాద్ కోవింద్ చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్నారు. 1955 మే 20న అనకాపల్లిలో జ‌న్మించిన సీతారామ శాస్త్రి మొదట టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పని చేసే వారు. స్వతహాగా సాహితీ ప్రియుడయిన సీతారామ శాస్త్రి తన ఖాళీ సమయాల్లో పలు పద్యాలు, గేయాలు రాసేవారు. ఆయన రాసిన ‘గంగావతరణం’ అనే గేయం కళాతపస్వి కె.విశ్వనాథ్ ఆయనని సిరివెన్నెల సినిమాకి పాటలు రాయమని అడిగారు. ఈ సినిమాలోని అన్ని పాట‌లు సిరివెన్నెలే రాశారు. ఈ సినిమాలో ఆయన రాసిన పాటలకు అపూర్వ ఆదరణ లభించి మొదటి సినిమాకే నంది అవార్డును అందుకున్నాడు. ఇదొక్కటే కాదు ఆయన సినీ జీవితంలో ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి. ఆయన్ని ఎట్టకేలకు పద్మశ్రీ వరించడం పట్ల తెలుగు ప్రేక్షకులు, సాహితీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More Related Stories