English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రావ‌ణాసురుడు.. నేను మాత్రం సీత‌ను కాదంటున్న శ్రీ రెడ్డి..

sri reddy  once again sensational comments on pawan kalyan
2019-03-16 14:39:51

పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి. ఈమెకు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేయడం తప్ప కొన్ని రోజుల నుంచి వేరే పనేమీ లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ ని తిడితే వార్తల్లో నిలుస్తుంది కాబట్టి ఆయన ఒక్కడినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి నానా మాటలు అనేసింది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అస్సలు కాకూడదు అంటూ విమర్శలు చేసింది శ్రీ రెడ్డి. ఆయనను నెత్తిన పెట్టుకొని ఊరేగే వాళ్లను కూడా ఓ రేంజ్ లో తిట్టి పోసింది శ్రీ రెడ్డి. నేను సీతను అని చెప్ప‌డం లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కచ్చితంగా రాముడు మాత్రం కాదు అని కుండబద్దలు కొట్టి వేసింది. ఆయన రావణాసురుడని.. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి.
మొన్నీమధ్య పార్వతి మెల్టన్, పూనమ్ కౌర్ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన అన్యాయాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేసింది శ్రీరెడ్డి. ఇది మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి ఆయనపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ రావణాసురుడు లాంటి వ్యక్తి అని.. ఆయన అధికారంలోకి వస్తే రాక్షస రాజ్యం వస్తుంది అంటూ విరుచుకు పడింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి వాడికి వాళ్ళ అన్న నాగబాబు సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నాడని.. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తుంది. రోజు రోజుకి శ్రీ రెడ్డి చేస్తున్న విమర్శలు హద్దుమీరి పోతుండటంతో మెగా అభిమానులు కూడా ఆమెపై ఓ కన్నేసి ఉంచారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటి చిల్లర ఆరోపణలు పట్టించుకోవద్దు అంటూ చెప్పడంతో వారు శాంతిస్తున్నారు.

 

More Related Stories