English   

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వాయిదా ప‌డిందిదా.. అనుకున్న‌దే జ‌రిగింది..

Ram Gopal Varma About Lakshmi's NTR Movie Release
2019-03-16 22:00:26

అనుకున్నట్టుగానే జరిగింది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా మార్చి 22 విడుదల కావడానికి కూడా అసాధ్యమే. ఈ విషయాన్ని చెప్పకనే ట్విట్టర్లో చెప్పేసాడు రామ్ గోపాల్ వ‌ర్మ. మొత్తానికి తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్నికల కమిషన్ కలిసి అనుకున్నంత పని చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మార్చి 22 నుంచి 29కి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సినిమా వాయిదా పడిందని వస్తున్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. త్వరలోనే కడపలో ఒక భారీ ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం.. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు తరలి రండి అంటూ వర్మ పోస్ట్ చేశాడు. ఇక్కడ అందరూ కేవలం ఆడియో రిలీజ్ మాత్రమే చూస్తున్నారు కానీ విడుదలకు వారం రోజుల ముందు ఆడియో రిలీజ్ చేయడం అనేది జరగదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ఉంటుంది.
ఒకవేళ మార్చి 22న సినిమా విడుదల అవుతుంది అనుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని వర్మ చెప్పేవాడు. కానీ అలా కాకుండా ఆడియో రిలీజ్ ఈవెంట్ అంటున్నాడు. అంటే మార్చి 22న సినిమా రాదని అర్థం చేసుకోవాలి. దానికి తోడు ఇప్పటి వరకు ఈ సినిమాకు సెన్సార్ పూర్తి చేయలేదు. సెన్సార్ చేయడానికి చాలా రోజుల కింద అప్లై చేసుకున్నా కూడా ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి నిర్ధారణ రాలేదు కాబట్టి సెన్సార్ చేయకుండా అలాగే పక్కన పెట్టేశారు. అక్కడి నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు సెన్సార్ కార్యక్రమాలు ముగించి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు సెన్సార్ స‌భ్యులు. అప్పటివరకు సినిమా బాక్స్ ల్లోనే. బయటకు రావడం అనేది అసాధ్యం. మార్చి 29న సినిమా వస్తుంది అంటున్నారు కానీ అప్పుడు వచ్చేది కూడా అనుమానమే అని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్పుడు వ‌ర్మ ఏం చేస్తాడో చూడాలిక‌.

 

More Related Stories