English   

త్రిష పెళ్లి చేసుకుంటుంది కానీ కండీష‌న్స్ అప్లై అంటుంది..

Trisha Krishnan openup about her marriage
2019-03-16 15:16:54

ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్లు చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఒక్క ఇండస్ట్రీ కాదు అన్ని ఇండస్ట్రీల్లో కూడా తమకు పెళ్లి వయసు వచ్చింది అని గుర్తు పెట్టుకొని త్వరగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు ముద్దుగుమ్మ‌లు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి గురించి కూడా ఇప్పుడు టాపిక్ నడుస్తుంది. నాలుగేళ్ల కిందట చెన్నై బిజినెస్ మాన్ వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి వరకు వెళ్లి ఆ తర్వాత క్యాన్సల్ చేసుకుంది ఈ చెన్నై చంద్రం. ఆ తర్వాత వరసగా సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ సినిమాలు తగ్గిపోయే సరికి అమ్మడి దృష్టి పెళ్లిపై పడిందని తెలుస్తోంది. మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు ఈమెకు ఎదురవుతూనే ఉన్నాయి.
దీనికి సమాధానం కూడా ఎప్పుడూ రొటీన్ గానే చెబుతుంది త్రిష. ఇప్పుడు కూడా ఇలాంటి సమాధానమే చెప్పింది ఈ భామ‌. తాను పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని.. కావాలంటే రేపే పెళ్లి చేసుకుంటాను చూసుకోండి అంటూ సవాల్ చేసింది త్రిష. కాకపోతే పెళ్లి అనేది చిన్న విషయం కాదని.. ఒక వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవాలి అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా.. అలాంటి సరైన వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది త్రిష. మరి ఈమె కోరుకుంటున్నట్లు ఆ క్లారిటీ ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో చూడాలి.

 

More Related Stories