English   

డియర్ కామ్రేడ్ టీజర్.. వాట్ ఏ రొమాంటిక్ గురు..

Dear Comrade Telugu Teaser
2019-03-17 08:56:11

విజయ్ దేవరకొండ సినిమాలపై ఇప్పుడు క్రేజ్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి మరో సాక్ష్యం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడు ఎవరూ పెద్దగా దీని గురించి పట్టించుకోలేదు. కానీ గీతగోవిందం, టాక్సీవాలా సినిమా సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమాపై కూడా అంచనాలు దారుణంగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతుంది. కాలేజీ గొడవల నేపథ్యంలో కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డియర్ కామ్రేడ్ మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్ లో ఏమీ లేనట్లు కనిపిస్తుంది కానీ ఏదో కనిపిస్తుంది. ముందు కామ్రేడ్ ను పరిచయం చేసిన దర్శకుడు భరత్.. ఆ తర్వాత లవర్ ను తన లవ్ ను పరిచయం చేశాడు. ఎప్పట్లాగే మరోసారి లిప్ లాక్ కింగ్ అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లో అధర చుంబనాలు విషయంలో ఆరితేరిపోయిన విజయ్ దేవరకొండ గీతగోవిందంలో కూడా ఒకసారి కిస్ చేసాడు. ఇక ఇప్పుడు కూడా రష్మిక మందన్నతో మరోసారి హాట్ లిప్ లాక్ చేసి కుర్రాళ్ళ మతులు చెడగొట్టేశాడు విజయ్ దేవరకొండ. మొత్తానికి టీజర్ చూస్తుంటే ఈ సారి కూడా విజయ్ బాగా గట్టిగా బాక్సాఫీస్ దగ్గర కొట్టేలా కనిపిస్తున్నాడు. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి భరత్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు

More Related Stories