English   

హిప్పీ టీజర్ తో వస్తున్నాడు !

Kartikeya Hippi teaser gets release date
2019-03-17 09:50:12

కార్తికేయ గుమ్మకొండ అంటే ఎవరికీ తెలియక పోవచ్చు కానీ ఆరెక్స్ 100 శివ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు అనడం అతిశయోక్తి కాదేమో. అలా ఆర్‌ఎక్స్100 అనే చిన్న సినిమాతో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తికేయ సినిమా కధా బలంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అంతటి భారీ విజయం సొంతం చేసుకున్న కార్తికేయ తాజాగా హిప్పి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని తమిళ నిర్మాత కళైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు టీఎన్ కృష్ణ తెరకెక్కిస్తుండగా నివాస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి బై లింగ్యుయల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కార్తికేయ బాక్సర్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో కార్తికేయ సరసన ముంబై భామలు దిగాంగన, జజ్బా సింగ్ లని కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. ఆ మధ్య రిలీజ్ అయిన పోస్టర్స్ లో ఇద్దరు భామలతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడు కార్తికేయ. ఇక ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి కావొస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మీద ద్రుష్టి పెట్టారు మేకర్స్. మరో మూడు రోజుల్లో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుందని ప్రకటించింది సినిమా యూనిట్.

 

More Related Stories