English   

పెళ్లి తర్వాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త జంట !

After Marriage sayesha saigal and Arya act together in Teddy Movie
2019-03-17 17:12:03

కొద్ది రోజుల క్రితమే పెళ్లి బంధంతో ఒక్కటయిన నటీనటుల జంట ఆర్య-సాయేశాలు తమ సినిమాల్లో మళ్ళీ బిజీ అవుతున్నారు. గజినీ కాంత్ అనే తమిళ సినిమాలో నటించిన ఈ జంట ఆ సినిమా షూట్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వయసు తేడా ఉన్నా ఇళ్ళల్లో ఒప్పించి ఇద్దరూ వివాహ బంధంతో ఈ నెల 10నఒక్కటయ్యారు. అయితే ప్రస్తుతం వేరూ కాప్పాన్ అనే సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా వీరి పెళ్లయ్యిందో లేదో వెంటనే వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారని వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ వివాహానంత‌రం తొలి చిత్రం పేరు టెడ్డీ అని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మే నెల నుండి యూర‌ప్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌ట‌. చిన్న పిల్ల‌ల‌కు అలాగే యూత్ ఈ ఎక్కువ‌గా క‌నెక్ట్ అయ్యేలా ఈ సినిమా కంటెంట్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి వివాహానంతఃరం ఈ జంట ఏమేరకు నటించి మెప్పిస్తుందో ?

 

More Related Stories