English   

మరోసారి రెచ్చిపోయిన నాగబాబు.. ఈసారి టార్గెట్ మీడియా..

Nagababu targets on media
2019-03-17 10:30:31

మై ఛానల్ నా ఇష్టం అంటూ ఈ మధ్య నాగబాబు వరుసగా వీడియోలు పెడుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల విమర్శలకు విమర్శలతో పాటు ఆదాయం కూడా వస్తుంది. దాంతో ఇదే బిజినెస్ బాగుంది అనుకొని వరుసగా అందరిపై సెటైరికల్ వీడియోలు పెడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులతో ఆడుకుంటున్నాడు ఈ మెగా బ్రదర్. తాజాగా మరోసారి ఇదే చేశాడు ఈయన. అయితే ఈసారి ఏ ఒక్క రాజకీయ నాయకుడుని టార్గెట్ చేయకుండా మీడియాను టార్గెట్ చేశాడు. ఎలా ఇప్పుడు రాజకీయ నాయకులకు తెలుగు మీడియా కొమ్ము కాస్తోంది.. అవినీతి కోసం గడ్డి తింటుంది అనేది ఈ వీడియోలో చూపించాడు నాగబాబు. ఇందులో ఒకటి నీతి గల మీడియా మరొకటి డబ్బు కోసం గడ్డి తిని మీడియా అనే రెండు పాత్రల చుట్టూ ఈ వీడియో నడిపించాడు నాగబాబు. నీతి గల కన్నయ్య అనే మీడియా పాత్రలో అదిరే అభి నటిస్తే.. అవినీతి గన్నయ్య పాత్రలో రాము నటించాడు. ఇద్దరూ కలిసి శ్రీ శ్రీ బాబా మహారాజ్ దగ్గరికి వస్తారు. ఆయన నాగబాబు అన్నమాట. వచ్చిన వెంటనే ఏం గన్నయ్యా... నువ్వు ఇలా గడ్డి తింటుంటే నీ వృత్తిలో ఉండేవారంతా గడ్డి తినేవారే అని జనాలు అనుకోరా..? అందుకే కన్నయ్య బాధ పడుతున్నారు అంటూ నాగబాబు ప్రశ్నిస్తాడు. దానికి కన్నయ్య సమాధానం ఇస్తూ ఒక రోజు నేను ఫ్యాన్ కింద కూర్చుని పచ్చగడ్డి తిన్నాను. ఆ రోజు నుంచి నాకు రూమ్ అంతా పచ్చగడ్డే కనిపిస్తోంది. ఆ టేస్టును మరిచిపోలేక ఎక్కడ గడ్డి దొరికితే అక్కడకికి సైకిల్ వేసుకుని మరీ వెళుతున్నాను. కడుపు నిండా గడ్డి తింటున్నాను.. అంటూ అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీలను ఏకిపారేశాడు నాగబాబు. వాళ్ల గుర్తులు సైకిల్, ఫ్యాన్ అనే పదాలు వచ్చేలా స్క్రిప్ట్ లో డైలాగుల పేల్చాడు నాగబాబు. నువ్వు గడ్డి తింటూ గొడ్డు నోటికాడ కూడు లాగేసుకుంటున్నావు.. అది తప్పు అని నీ మనసు నీకు చెప్పలేదా గన్నయ్య.. అంటూ ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలకు భజన చేస్తున్న మీడియా ఛానల్స్ పై సెటైర్లు వేసాడు నాగబాబు. అక్కడితో ఆగకుండా జనాలు నిజం తెలిసిన తర్వాత మీ దుంప తెంచేస్తారు అంటూ ఒక పాట కూడా అందుకున్నాడు నాగబాబు. అందులో చాలా విషయాలపై సెటైర్లు వేసాడు మెగా బ్రదర్. సత్యాన్ని పాతేసి నిత్యం వ్యక్తిత్వ హత్యలు చేస్తున్నారు.. అమ్మను సొమ్ముకై అమ్ముకుంటే జనులు దుమ్ము దులిపేస్తారంటూ నాగబాబు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మొత్తానికి ఈ మీడియాపై వీడియో ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది.

More Related Stories