English   

పంజా వైష్ణవ్ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో...ఇట్స్ అఫీషియల్ !

Vijay Sethupathi confirmed as villain in Panja Vaisshnav Tej movie
2019-03-17 10:47:24

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అవుతున్న మెగా హీరో ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే ఆ అంచనాలను అందుకునే స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారని అందుకే ఆ సినిమాలో విలన్‌ గా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి నటించనున్నాడని కొద్ది వారాల క్రితం వార్తలు వచ్చాయి. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలో అయన విలన్ గా నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా ఈ సినిమా దర్శకుడు ఒకప్పుడు సుకుమార్ వద్ద అసిస్టంట్ గా పనిచేసిన బుచ్చిబాబు సనా సుకుమార్, విజయ్ సేతుపతి మరికొందరితో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లవ్ యూ సర్ అని పేర్కొన్నాడు. ఇదే నిజమయితే విజయ్ నేరుగా చేస్తున్న రెండవ సినిమా ఇదే అవుతుంది, ఇప్పటికే ఆయన     సైరాలో చిరంజీవి పక్కన నటిస్తున్నారు. ఇక వైష్ణవ్ పక్కన మనీషా రాజ్ అనే అమ్మాయి నటిస్తుండగా ఈ సినిమాని సుకుమార్ సొంత సంస్థలాంటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెరకెక్కిస్తున్నారు.
 

More Related Stories