English   

విజయ్ దేవరకొండ.. ద లిప్ లాక్ కింగ్ ఆఫ్ టాలీవుడ్..

vijay devarakonda lip lock sensations and kiss with rashmika mandanna in dear comrade
2019-03-17 11:02:42

తెరపై ముద్దులు పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు.. దానికి మన హీరోలు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మన వాళ్ళలో కూడా మార్పు వచ్చి బాలీవుడ్ సినిమాలు చూసి ఇక్కడ కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఓకే అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇలా ముద్దుల వర్షం కురిపించిన మొదటి హీరో అల్లు అర్జున్. ఆర్య 2 సినిమా నుంచి అప్పట్లో ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్ చేశాడు. వేదం, వరుడు లాంటి సినిమాల్లో కాస్త ఘాటు ముద్దులు పెట్టాడు అల్లు అర్జున్. పెళ్లి తర్వాత పూర్తిగా ముద్దు సన్నివేశాలకు దూరం అయిపోయాడు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు, రవితేజ లాంటి హీరోలు కూడా అప్పుడప్పుడు లిప్ లాక్ సీన్స్ చేయడం విశేషం. ఇక ఇప్పుడు అందరినీ దాటేస్తూ తెలుగు ఇండస్ట్రీలో కిస్సింగ్ రాజాగా మారిపోతున్నాడు విజయ్ దేవరకొండ.

ప్రతి సినిమాలోనూ ఓ ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు ఈ హీరో. పెళ్లి చూపులులో చాలా క్లీన్ గా కనిపించిన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో ముద్దుల వర్షం కురిపించాడు. ఆ సినిమాలో దాదాపు 15కు పైగా ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. ఇక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన గీతగోవిందం సినిమాలో కూడా ఒక లిప్ లాక్ సీన్ చేశాడు విజయ్ దేవరకొండ. మధ్యలో నోట సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ ఉంది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ లో కూడా రష్మిక మందన్నతో అదిరిపోయే రొమాన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. వీళ్లిద్దరి మధ్య వచ్చిన ముద్దు సన్నివేశం టీజర్ కు హైలెట్ గా నిలిచింది. ప్రతి సినిమాలోనూ కథతో పాటు ముద్దులు కూడా విజయ్ దేవరకొండ కలిసి వస్తున్నాయి. దాంతో ఆయన కూడా అన్నింటికీ సరే అంటున్నాడు. పైగా యూత్ ను టార్గెట్ చేయాలంటే ఇలాంటి పనులు తప్పనిసరి. సినిమాలో విషయంతో పాటు వినోదం కూడా ఉంటే తప్పు లేదు.. కేవలం సినిమాలను నడిపించడం తప్పు. కాని కథ మధ్యలో ముద్దులు రావడం పెద్ద తప్పేమీ కాదు. ఇదే ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.

More Related Stories