English   

ఫ్లాప్ డైరెక్టర్ ల పాలిట ఆపద్బాంధవుడు జూనియర్ ఎన్టీఆర్..

Jr NTR Giving Chances to Flop Directors
2019-03-17 11:38:46

ఒకప్పుడు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక చెడ్డ పేరు ఉండేది. ఎవరైనా దర్శకుడు ఒక హిట్ కొడితే వెంటనే ఆయన్ని బ్లాక్ చేసుకొని తర్వాత సినిమా చేస్తాడు అంటూ ఆయనపై విమర్శలు ఉండేది. హిట్ దర్శకులను మాత్రమే ఎన్టీఆర్ నమ్ముతాడు.. ఫ్లాప్ డైరెక్టర్లకు ఇవ్వాలంటే భయపడతాడు అని ఎన్టీఆర్ పై సెటైర్లు కూడా పదేవి. చాలా సంవత్సరాల వరకు కేవలం దర్శకులతో మాత్రమే పని చేస్తూ వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ వాళ్లలో ఒక్కరు కూడా ఆయనకు కోరుకున్న విజయం ఇవ్వలేకపోయారు. అయితే టెంపర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ మారింది.. దర్శకులను ఎంచుకునే తీరు కూడా మారిపోయింది. అప్పటి వరకు కేవలం హిట్ దర్శకుడితో మాత్రమే పని చేస్తూ వచ్చిన నందమూరి వారసుడు ఆ తర్వాత కేవలం ప్లాప్ దర్శకులకు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టాడు. పూరి జగన్నాథ్ అప్పటివరకు వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆయనను నమ్మి టెంపర్ సినిమా చేసి హిట్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత నేనొక్కడినే లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చిన సుకుమార్ ను నమ్మి నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు. ఇది కూడా ఆయన కెరీర్లో మంచి విజయంగా నిలిచిపోయింది. పైగా ఇది ఎన్టీఆర్ కు 25వ సినిమా కావడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమాతో దారుణంగా మునిగిపోయిన బాబీ.. జూనియర్ ఎన్టీఆర్ నమ్ముకొని జై లవకుశ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా అజ్ఞాతవాసి సినిమా చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ ను నమ్మి అరవింద సమేత సినిమా చేసి ఆయనకు కూడా లైఫ్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి ఒకప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లు అంటే భయపడతాడు అనే విమర్శ నుంచి.. ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లకు వరుస అవకాశాలు ఇచ్చి వాళ్లకు లైఫ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు.

More Related Stories