English   

రాజకీయాల్లోకి వస్తా కానీ తండ్రి పార్టీలో చేరనంటున్న వరలక్ష్మి..

Varalakshmi Sarathkumar's request to her fellow actors
2019-03-17 11:53:52

వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విశాల్ పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి వరలక్ష్మి పేరు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. అయితే తాము స్నేహితులం మాత్రమే అని.. కేవలం మీడియా మాత్రమే తమను ప్రమోట్ చేసింది అంటూ ఇద్దరు చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు విశాల్ పెళ్లి చేసుకుంటుండడంతో ఈ వార్తలకు చెక్ పడిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడింది. తమిళనాట ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకురాలిగా మారిపోయింది వరలక్ష్మి. తాజాగా ఒక ఈవెంట్ కు వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ అమ్మాయిలపై బయట సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి నోరు విప్పింది.

ఈ మధ్య పొల్లాచ్చిలో జరిగిన ఒక అత్యాచార ఘటన సౌతిండియాను కుదిపేసింది. అలాంటి మానవ మృగాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. మనం ఉన్న సమాజంలో కనీసం ఇలా బతుకుతున్నాం అంటే సిగ్గుపడండి అంటూ వరలక్ష్మి ఫైర్ అయ్యింది. జరుగుతున్న అన్యాయాలపై కచ్చితంగా ఎవరో ఒకరు నోరు విప్పి మాట్లాడాలని.. తనకు ఆ ధైర్యం ఉంది అంటోంది ఈ స్టార్ డాటర్. ఇండస్ట్రీలో కూడా మీటు ఉద్యమంపై తనతో పాటు చిన్మయి లాంటి వాళ్ళు బయటికి వచ్చి నోరు విప్పామని వాళ్లపై కూడా కొందరు బెదిరింపులు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని.. కాకపోతే తన తండ్రి శరత్ కుమార్ పార్టీలో మాత్రం కచ్చితంగా చేరనని చెప్పింది వరలక్ష్మి. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు సినిమా ప్రముఖులు కూడా స్పందించాలని.. అలా జరిగితే బయట సమాజంలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉందని చెబుతుంది వరలక్ష్మి శరత్ కుమార్.

More Related Stories