English   

చిన్న సినిమాని ఎత్తుకున్న గీతా కాంపౌండ్ !

Geetha Films to Release Nuvvu Thopu Raa
2019-03-17 12:22:33

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నాగరాజ్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్లో తనదైన మార్క్ వేసుకున్న తెలంగాణా కుర్రోడు సుధాకర్‌ కోమాకుల హీరోగా నటించిన తాజా చిత్రం నువ్వు తోపురా. ఈ మధ్యే ఈ సినిమా టీజర్ ను ప్పటి సుధాకర్ ఫ్రెండ్ ఇప్పటి టాలీవుడ్ హాట్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ ఆకట్టుకోగా హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లి మరీ అక్కడ దండా చేసే కుర్రాడిగా మనోడి నటన ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. 

వచ్చే నెల అంటే ఏప్రిల్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని అల్లు అరవింద్ కాంపౌండ్ నుండి డిస్ట్రిబ్యూషన్ చేయడం. నిజానికి గీత గోవిందం సమయం నుండి విజయ్ కి మెగా కాంపౌండ్ తో రాపో పెరిగింది. ఆ మధ్య ఏకంగా నీహారికనిచ్చి పెళ్లి చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయనుకోండి. ఇప్పుడు అదే రాపోతో తన ఫ్రెండ్ సినిమాని ఆ బ్యానర్ మీద డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా విజయ్ సిఫార్సు చేయడంతో మెగా కాంపౌండ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. నిజమెంతో తెలీదు కానీ ఒక చిన్న సినిమాని అల్లూ కాంపౌండ్ ఎత్తుకుంది అంటే సినిమాలో కూడా విషయం ఉండనే టాక్ వినిపిస్తోంది.

More Related Stories