English   

వర్మకి షాక్...రిలీజ్ కష్టమే !

Ram Gopal Varma Open Letter To Censor Board Slams CBFC For Stalling Lakshmi’s NTR Release
2019-03-17 19:39:48

అంతా అనుకున్న‌ట్లుగానే అయింది, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌లకి అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుద‌ల కాకుండా సెన్సార్ బోర్డ్ అడ్డు క‌ట్టేసింది. అందరూ ఊహించినట్టే ఇప్పుడు సెన్సార్ బోర్డు వర్మకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వబోమని ప్రధాన పార్టీతో ఈ సినిమాకి సంబంధం ఉందని అందుకే ఎన్నికలయ్యే వరకూ ఈ సినిమా సెన్సార్ చేయమని చెబుతూ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిపికేషన్ (సీబీఎఫ్‌సీ) వర్మకు తెలియజేసింది. దీంతో ఈ విషయంలో సెన్సార్ బోర్డు కావాలనే తాత్సారం చేస్తోందని వర్మ ఆరోపించారు. అందుకే సెన్సార్ బోర్డుపై కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. సెన్సార్ బోర్డుకు కేవలం సర్టిఫికెట్ జారీచేసే అధికారం మాత్రమే ఉందనీ, సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసే అధికారం లేదని చెబుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. సెన్సార్ బోర్డు తన సినిమాను చట్టవిరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త దేవీ బాబు చౌదరి అనే వ్యక్తి ఎన్నిక‌ల క‌మీష‌న్ కు ఫిర్యాదు చేసాడు. దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఎన్నిక‌ల క‌మీష‌న్ తామేమీ చేయలేమని చేతులు ఎత్తేసింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా సెన్సార్ బోర్డు వర్మకి షాకిచ్చింది. అయితే సినిమా చూడకుండా దానికి సర్టిఫికెట్ ఇవ్వడాన్ని వాయిదా వేసే హక్కు సెన్సార్ బోర్డుకు లేదని అలా చేస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ఏమో ? సినిమా అసలు రిలీజ్ అవుతుందో లేదో ?

More Related Stories