English   

రాజకీయాల్లోకి అజిత్ ?

director susindran asks Ajith to enter politics
2019-03-17 13:38:08

సినిమాల్లో బాగా పాపులర్ అయ్యాక హీరోలు మొదలు చాలా మంది నటులు రాజకీయాల వైపు మొగ్గు చూపడం మనం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే తమిళనాట అజిత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత రాజకీయంగా ఎన్నో సంచలనాలు జరిగాయి. జయలలిత మానసపుత్రుడిగా, రాజకీయ వారసుడిగా అజిత్‌ పై మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఆయనను తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. విదేశాలలో షూటింగ్ లో ఉన్న ఆయన నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి ఆయన నివాళులు అర్పించి జయమ్మ మీద అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఆయన ఎన్ని సార్లు తనకు రాజకీయాలు ఇంటరెస్ట్ లేదన్నా మళ్ళీ మళ్ళీ ఆయన రాజకీయ ఎంట్రీ గురించే చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం కూడా తనకు హీరోగా కెరీర్ ముఖ్యమని, తనకు అసలు రాజకీయాలు పడవని తన మీద ఫాన్స్ స్ప్రెడ్ చేస్తున్న వార్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వొద్దని చెప్పి షాకిచ్చాడు.  అయితే మళ్ళీ అయన రాజకీయాల్లోకి రావాలని కోరుతూ దర్శకుడు సుశీంద్రన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 40 ఏళ్ల ద్రవిడ రాజకీయాల్లో మార్పు రావాలంటే అది అజిత్ వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. తమిళనాడు ప్రజల కోసం మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుతున్నానని,  రాజకీయాల్లో మీ రాక కోసం ఎదురుచూస్తున్న కోట్లాది అభిమానుల్లో నేనూ ఒక్కడ్నని పేర్కొన్నారు. మరి అజిత్ దీని మీద ఎలా స్పందిస్తారో ఏమో ? చూడాలి.

 

More Related Stories