English   

వైసీపీ తరపున ప్రచారానికి పూరీ...ఎందుకంటే !

Puri-Jagannadh
2019-03-18 01:42:27

వైసీపీకి ఈ ఎన్నికల్లో ఇప్పటికే సినీ గ్లామర్ డోస్ ఎక్కువవుతుండగా ఇప్పుడు ఈ లిస్టులో ఒక టాప్ డైరెక్టర్ వచ్చి చేరాడు. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తాజాగా పూరి జగన్నాథ్ సోదరుడు పి. ఉమాశంకర్ గణేష్ కు నర్సీపట్నం టికెట్ ను వైసీపీ ఖరారు చేసింది. నిన్న జగన్ ప్రకటించిన లిస్ట్ తో ఆ విషయం తేట తెల్లం అయ్యింది. దీంతో పూరీ కూడా వైసీపీ తరుఫున ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. గతంలో పూరి జగన్నాథ్ తల్లి వైసీపీ సర్పంచ్ గా పోటీచేశారు. అప్పుడు హీరో సాయి శంకర్ ఆమె గెలుపు బాద్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన సోదరుడు అదే పార్టీ నుంచి ఏకంగా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తుండడంతో దర్శకుడు పూరి ఈ సారి వైసీపీ తరుఫున ప్రచారం చేస్తాడన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుండి పోటీ చేశారు. కేవలం రెండు  వేల వోట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారి తమ్ముడు పూరీ వచ్చి ప్రచారం చేస్తే ఏమైనా ఎమ్మెల్యేగా గెలవచ్చేమో ?

More Related Stories