English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో అందరూ కలిసి తొక్కేసారుగా..

RGV
2019-03-18 02:12:19

మనం ఉన్నది స్వతంత్ర భారతదేశంలో. ఇక్కడ ఎవరికి అనిపించింది వాళ్ళు చేస్తారు. భావ స్వతంత్ర హక్కుతో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకు తమకు ఏది అనిపిస్తే అది తెరకెక్కించే హక్కు ఇక్కడ ఉంటుంది. అది తప్పు అని చెప్పే హక్కు సెన్సార్ బోర్డు దగ్గర ఉంటుంది. కొన్నిసార్లు హద్దులు దాటిన సినిమాలను సెన్సార్ కత్తెరకు పని చెప్పి కట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. అయితే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. అసలు సినిమా విడుదలను ఆపే హక్కు సెన్సార్ బోర్డు ఉండదు. కానీ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్నికల కమిషన్ పేరు చెప్పుకొని సెన్సార్ బోర్డు అసలు సెన్సార్ కూడా చేయకుండా ఎన్నికల తర్వాత విడుదల చేసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అసలు సెన్సార్ బోర్డుకు సినిమాను అడ్డుకునే అధికారం ఎక్కడ ఉంది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇదే విషయంపై ఆయన మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను జర్నలిస్టులతో పంచుకోవాలని చూస్తున్నాడు. ప్రేక్షకులు చూస్తున్నారని.. ఎవరూ తమ స్వలాభం కోసం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపలేరు అంటున్నాడు ఆయన. కోర్టుకు వెళ్లి అయినా సరే సినిమాను విడుదల చేస్తాను అంటున్నాడు ఈ దర్శకుడు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇది పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరకెక్కించాడు అంటూ ఎన్నికల తర్వాత కానీ సినిమాను విడుదల చేసుకోకూడదు అంటూ ఆర్డర్స్ పాస్ చేసింది. దాంతో మార్చి 22 కు రావాల్సిన సినిమా కాస్త ఏప్రిల్ 11 తర్వాత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై వర్మ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories