English   

వర్మ దెబ్బకు దిగొచ్చిన సెన్సార్ బోర్డు !

RGV
2019-03-18 03:04:15

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దివంగత ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఎలా అయినా రిలీజ్ చేయాలని వర్మ భావిస్తుంటే ఎలా అయినా ఆపాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఈ సినిమా రాజకీయాలను ప్రభావితం చేసేడిలా ఉండడం వలన ఎన్నికలయ్యే దాకా ఈ సినిమా సెన్సార్ చేయలేమని సెన్సార్ బోర్డు వర్మకి షాకిచ్చింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని అప్పుడు తాము సెన్సార్ చేస్తామని వెల్లడించింది. దీంతో తాను ఈ విషయం మీద న్యాయపోరాటం చేస్తానని వర్మ ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు. సినిమా చూశాక అభ్యంతరాలు ఉంటె అప్పుడు ఆపాలి కానీ అసలు ఇలా చూడమని చెప్పడం కరెక్ట్ కాదని ఆయన వాదన, అయితే ఎట్టకేలకు ఆయనకు సెన్సార్ కష్టాలు తీరాయి. ఈ విషయాన్ని నిన్న అర్ధరాత్రి పొద్దుపోయాక వర్మ స్వయంగా ట్వీట్ చేశారు. దురదృష్టవశాత్తూ మాకూ, సెన్సార్ బోర్డు మధ్య కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయని అవిప్పుడు తొలగిపోయాయి. నిబంధనల ప్రకారం, అవసరమైన చర్యలను తీసుకునేందుకు సెన్సార్ బోర్డు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు మేము చెప్పినట్టు మీడియాతో మాట్లాడాల్సిన  సమావేశాన్ని రద్దు చేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు. అయితే అపార్ధాలు అని ఆయన అంటుంటే సెన్సార్ బోర్డు చెప్పింది వర్మ తప్పుగా అర్ధం చేసుకున్నాడా ? లేక వర్మ దెబ్బకు సెన్సార్ బోర్డు దిగొచ్చిందా ? అనేది తేలాల్సి ఉంది.

More Related Stories