English   

రోడ్డుపై చిందులేసిన స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Shriya
2019-03-18 04:36:08

రోడ్డుపై స్టార్ హీరోయిన్ ఎందుకు చిందులేస్తుంది.. ఏదైనా షూటింగ్ కోసం డ్యాన్సులు చేసిందా అని అనుకుంటున్నారా.. షూటింగ్ కోసం డాన్స్ లు చేస్తే అందులో విశేషం ఏముంది.. డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి కచ్చితంగా ఎక్కడైనా డాన్సులు చేయాల్సిందే. కానీ ఇక్కడ రోడ్డుపై డాన్స్ చేసిన స్టార్ హీరోయిన్ ఇంకెవరో కాదు శ్రియా సరన్. పెళ్లి తర్వాత ఇండియా వదిలేసి ఫారెన్ లో సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. పైగా ఈమె భర్త కూడా ఇండియన్ కాదు. దాంతో ఇప్పుడు శ్రియ కూడా ఇండియాతో బంధం వేసుకొని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. విదేశాల్లో కార్నివాల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. అది చదువుతున్నప్పుడు రోడ్లమీద ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు డాన్సులు చేస్తుంటారు. ఈ పండగలో శ్రీయ కూడా భాగంగా మారింది. అప్పుడు తనకు నచ్చిన డాన్స్ స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది ఈ భామ. మొన్నటి వరకు వరస సినిమాలు చేసిన శ్రీయ శరన్.. పెళ్లి తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి చుట్టపుచూపుగా సినిమాలు చేయడమే కాని ఒకప్పుడు ఒప్పుకున్నట్లు వరుసగా సినిమాలు చేయడం లేదు శ్రీయ. ప్రస్తుతం ఈమె నటించిన నరకాసురుడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అరవింద్ స్వామి కి జోడీగా నటించింది శ్రీయ. మొత్తానికి సినిమాలకు దూరంగా ఉన్నా ప్రేక్షకులకు మాత్రం దగ్గరగా ఉండాలని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories