English   

అంతా రాజమౌళి చేశాడంటున్న అలియా భట్..

Alia-Bhatt
2019-03-18 04:47:06

రాజమౌళి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వస్తుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్. ఇప్పటికే ఈ చిత్రం కోసం తాను ప్రిపేర్ అవుతున్నాను అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే రాను రాను రాజమౌళి కూడా శంకర్ మాదిరే తయారవుతున్నాడు. ఈయన కూడా తన సినిమా పూర్తయ్యే వరకు నటీనటులను పూర్తిగా లాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆలియా భట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలీవుడ్లో అన్ని పూర్తి చేసుకున్న తర్వాత రాజమౌళి సినిమా వైపు రానుంది ఈ ముద్దుగుమ్మ. ఈమధ్య రాజమౌళి సినిమా గురించి మీడియాతో మాట్లాడిన ఆలియా భట్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 

ఇందులో తన పాత్ర గురించి చెప్పండి అంటే ఇప్పటి వరకు రాజమౌళి తనకు కథ కూడా చెప్పలేదని చెప్పి ఆశ్చర్యపరిచింది ఆలియా. కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో.. కచ్చితంగా క్యారెక్టర్ బాగానే ఉంటుందని ఆశించి ఈ సినిమా ఒప్పుకొన్నా అంటుంది ఆలియా. ఇక రామ్ చరణ్ తో నటించడం అద్భుతంగా అనిపిస్తోందని.. ఆయనతో నటించాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నట్లు చెప్పింది ఆలియా భట్. రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఒక డ్రీమ్ అని.. అది ఇంత త్వరగా నెరవేరుతుందని ఎప్పుడూ అనుకోలేదని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. కచ్చితంగా ఈ సినిమాతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటానని చెబుతుంది అలియా భట్. 

పూణేలో రాజమౌళి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జరగనుంది. ఇదే షెడ్యూల్లో అజయ్ దేవగన్ తో పాటు ఆలియా భట్ కూడా చేరిపోతుందని తెలుస్తోంది. వీళ్లిద్దరి డేట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా అలియా భట్ 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇది ఎక్కువ అని తెలిసినా కూడా బాలీవుడ్లో ప్రస్తుతం అలియా భట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమాకు హెల్ప్ అవుతుందని ముందడుగు వేశాడు రాజమౌళి. సినిమా గురించి ఒక్క ముక్క చెప్పమన్నా కూడా రాజమౌళి పర్మిషన్ ఇవ్వలేదని.. అంతకంటే ఎక్కువ మాట్లాడలేను అంటూ ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది ఆలియా భట్. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఇదే డైలాగులు కొడుతున్నారు. ఎక్కడ రాజమౌళి సినిమా గురించి అడిగినా ఆయనే స్వయంగా చెబుతాడు అంటూ తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పాఠం ఆలియా భట్ కూడా నేర్చుకుంది.

More Related Stories