English   

చంద్రబాబుపై విరుచుకుపడిన పోసాని కృష్ణ మురళి..

Posani
2019-03-18 05:26:47

నటుడు, దర్శకుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగాడు. తన సినిమాపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన మండిపడ్డారు. ఇంకా పూర్తికాని సినిమా ఎలా ఉందో తెలుసుకోకుండా ఈసీకి ఫిర్యాదు చేయడం కంటే తెలివితక్కువ పని మరొకటి లేదు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. చంద్రబాబునాయుడుని తిట్టాలంటే దానికోసం ప్రత్యేకంగా ఒక సినిమా చేయాలా అంత సీన్ లేదు అంటూ తీసిపారేసాడు పోసాని కృష్ణమురళి. తన సినిమా ఏ ఒక్కరిని తిట్టడానికి చేసింది కాదు.. అని దేశానికి పనికొచ్చే సినిమా తెరకెక్కిస్తున్నాను అంటున్నాడు ఈ దర్శకుడు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నానని.. ఇందులో ప్రజలకు పనికొచ్చే చాలా విషయాలు ఉన్నాయి అని చెబుతున్నాడు ఈ దర్శక నిర్మాత. ఇందులో చంద్రబాబుకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉంటాయని మీరు ఎలా ఊహించుకుంటారని.. ఇది పూర్తిగా ప్రజలకు సంబంధించిన సినిమా అంటున్నాడు పోసాని కృష్ణ మురళి. దీనిపై ఎన్నికల కమిషన్కు ఎవరు ఫిర్యాదు చేశారో తెలియదు అని అలా చేయడం మాత్రం తప్పు అంటున్నాడు ఈయన. చంద్రబాబు ఒక కులాన్ని కాదు అన్ని కులాలను తాను తిట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ తో కూడా తిట్టించాడని చెప్పాడు పోసాని కృష్ణ మురళి. ఆ తప్పు తెలుసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధపడుతున్నాడని చెప్పాడు ఈయన. ఇదిలా ఉంటే ఈసి ఇచ్చిన ఫిర్యాదుకు తాను ఎప్పుడో సమాధానం ఇచ్చేశానని చంద్రబాబుకు దమ్ముంటే ముందుకు రమ్మని సవాల్ చేస్తున్నాడు పోసాని కృష్ణ మురళీ. తను సంజాయిషీ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ రమ్మని పిలుస్తున్నారు అంటే తనను చంపడానికి కుట్ర చేస్తున్నారేమో అంటూ పోసాని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై తాను ఊరుకోనని ఎలక్షన్ కమిషన్ కు చంద్రబాబు నాయుడు తీరుపై లేఖ రాస్తాను అంటున్నాడు ఈ నటుడు.

More Related Stories