English   

సాహో సెట్ లో మరో సెలెబ్రేషన్.. ఘనంగా విలన్ వీడ్కోలు !

Arun-Vijay
2019-03-18 06:34:04

తమిళనాట ఒకవైపున హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున అందివచ్చిన అన్ని పాత్రలనూ చేస్తూ అరుణ్ విజయ్ ముందుకు వెళ్తున్నాడు. ముందుగా రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన ఆయన ఇప్పుడు తాజాగా సాహోలో కూడా ప్రభాస్ కి విలన్ గా నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా సాహో టీం అంతా అరుణ్ విజయ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆయన పాత్ర షూటింగు అయిపోయిందట. అందుకే ఆయనకు ఫేర్ వెల్ ఇస్తూ ఆయనతో కేక్ కట్ చేయించిన టీమ్ ఆయనకీ ఆత్మీయ వీడ్కోలు పలికింది. ప్రభాస్‌ కథానాయకుడిగా, బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా రెండేళ్ల నుంచి చిత్రీకరణ జరుపుకుంటున్నా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు. కానీ అరుణ్‌ విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించిన ఈ ఫేర్ వెల్ కేక్ కట్టింగ్ విషయం ట్విట్టర్ లో పోస్ట్ చేశాక, ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆగస్ట్‌ 15 వరకు ఆగాల్సిందే అనడంతో అది ఆగష్టు నెలలో రిలీజ్ ఆవడం ఖాయమని భావిస్తున్నారు.  

More Related Stories