English   

రష్మీ కార్ యాక్సిడెంట్...క్రిటికల్ కండిషన్ !

Rashmi
2019-03-18 08:51:11

బుల్లితెర యాంకర్ రష్మీ కొత్త చిక్కుల్లో పడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు మీద నడుస్తున్న ఓ వ్యక్తిని ఢీకొనగా, అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. నిన్న రాత్రి 11 సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. అయితే వెంటనే అక్కడ గుమికూడిన జనం వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. హైదరాబద్ లోని బేగంపేటలో నివాసం ఉండే రష్మి ఫ్యామిలీ విశాఖలో ఉంటుంది, బహుశా ఆమె వారి కోసమే అక్కడికి వెళ్లి ఉండచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్న విషయం తెలియాల్సివుంది. ఈ విషయం మీద రష్మీ స్పందిస్తే తప్ప పూర్తి వివరాలు బయటకి రావు.
 

More Related Stories