English   

పూజా హెగ్డే బరువు పెరిగిందిగా.. జిగేల్ రాణి న్యూ లుక్..

Pooja-Hegde
2019-03-18 10:05:30

ఒంటిమీద కేజీ కండ లేదు ఏం చూసుకొని నీకు అంత పొగరు అంటూ అతడు సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెబుతాడు. నిజానికి మన తెలుగు హీరోయిన్లు మొత్తం అలాగే ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ఒంటిమీద కేజీ కండ కాదు కదా అర కేజీ కండ కూడా లేకుండా మరి పీక్కుపోయి కనిపిస్తుంటారు. దానికి జీరో సైజ్ అని పేరు పెట్టుకుని కంటి నిండా నిద్ర పోకుండా కడుపునిండా తినకుండా ఎంతో కష్టపడుతుంటారు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పుష్టిగా తింటూ బొద్దుగా మారిపోతుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇదే చేస్తుంది. మొన్నటి వరకు ఈ భామ కూడా జీరో సైజ్ అంటూ సన్నగా మెరుపు తీగలా ఉన్నా.. ఇప్పుడు మాత్ర బొద్దు అందాలతో ముద్దుగా కనిపిస్తోంది. రంగస్థలం సినిమాకు ముందు వరకు చాలా సన్నగా ఉంది పూజ హెగ్డే. డిజె సినిమాలో బికినీ కూడా వేసి కుర్రాళ్ళ మతులు చెడగొట్టింది ఈ జిగేల్ రాణి. అయితే అరవింద సమేత నుంచి కొద్ది కొద్దిగా బరువు పెరగడం మొదలు పెట్టింది పూజ హెగ్డే. ఇక ఇప్పుడు ఈమె పూర్తిగా కొత్త లుక్ కి వెళ్లిపోయింది. ఒకప్పుడు మనం చూసిన పూజకు ఇప్పుడు మనం చూస్తున్న పూజా హెగ్డేకు చాలా తేడా ఉంది. తాజాగా ఒక ఈవెంట్ కు వచ్చిన ఈ ముద్దుగుమ్మ బాగా వెయిట్ పెరిగిపోయి కనిపించింది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈమె అందం డబుల్ అయ్యింది. దానికి కారణం బరువు పెరగడమే అంటుంది పూజా హెగ్డే. చూడ్డానికి నిండుగా బొద్దుగా గతం కంటే అందంగా కనిపిస్తుంది ఈ గోపికమ్మ. ఇప్పటి నుంచి ఇదే లుక్కు మెయింటెన్ చేస్తానని చెబుతోంది పూజ హెగ్డే. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మహర్షి సినిమాతో పాటు ప్రభాస్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టింది పూజా హెగ్డే.

More Related Stories