English   

నారా లోకేష్ కోసం మహేష్ అక్క ప్రచారం !

Mahesh-Babu
2019-03-18 10:42:07

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టీ సినిమా గ్లామర్ మీద కూడా పడుతోంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీకి ఈ గ్లామర్ ఎక్కువ కనిపించింది. అయితే ఈ సారి టాలీవుడ్ లో లీడ్ కమెడియన్స్ అందరూ జగన్ వైపు చూస్తున్నారు. ఇక పెద్ద హీరోల విషయానికి వస్తే వాళ్ళు ప్రతి ఎన్నికల్లో లానే ఈ ఎన్నికల్లో కూడా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఇక బాలయ్య లాంటి ఒకరిద్దరు ఎన్నికల బరిలో ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ సోదరి ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ కోసం ప్రచారం చేయడమే కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజధాని ఉన్న మంగళగరి నుండి లోకేష్ పోటీ చేస్తుండటంతో ఆయన కోసం మహేష్ సోదరి పద్మావతి ప్రచారం చేస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా నిజానికి మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. లోకేష్ నియోజకవర్గం కూడా అందులో ఒకటి కావడంతో ఆమె తన భర్త జయదేవ్, లోకేష్ లతో కలిసి ప్రచారం నిర్వచించారు.

More Related Stories