English   

ఆర్ఆర్ఆర్ కి మీరే టైటిల్ పెట్టండి !

Rajamouli
2019-03-18 11:32:37

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు లీడ్ రోల్స్ లో ఒక భారీ మల్టీస్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, వీరిద్దరికీ జోడీలుగా అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసినట్లుగా రాజమౌళి తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 2020 జూలై 30న రిలీజ్ కానున్న ఈ సినిమాకి నాలుగు బాషలలోనూ కామన్ టైటిల్ ఉంటుంది ఆర్ఆర్ఆర్ అని. కానీ ప్రతి భాషకు ఒక్కో టైటిల్ ఉంటుందని రాజమౌళి మొన్నే ప్రకటించారు. తాజాగా ఆర్ఆర్ఆర్ కు క్యాప్షన్ గా ఉండేందుకు మంచి టైటిల్ చెబితే, అందులో బాగున్న టైటిల్ ను ఎంపిక చేసి సినిమాకు పెడతామని యూనిట్ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ అంటే అబ్రివేషన్స్ చెప్పాలని, వాటిని రాజమౌళి స్వయంగా పరిశీలిస్తారని, అభిమానులు తమ టైటిల్స్ ను ట్వీట్ చేయాలని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రేక్షకులను కోరింది.

More Related Stories