English   

వర్మ సినిమా రిలీజ్ ఆ రోజునేనా ?

Ramgopalvarma
2019-03-18 13:42:01

నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అంటూ మహేష్ టక్కరి దొంగ సినిమాలో ఒక పాట ఉంటుంది. ఒక్కోసారి వింటుంటే ఈ పాట కొంపతీసి వర్మ ఏమైనా రాయించుకున్నాడా అనే అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. అంత కొత్తగా, వింతగా ఉంటాయి వర్మ చేసే పనులు. ఇక విషయానికి వస్తే పెద్దాయన ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన నాటి నుండి జరిగిన విశేషాలను కధ పెట్టుకుని వర్మ లక్ష్మీస్ ఎన్టీయార్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మీద కొందరు ఎలక్షన్ కమిషన్ కు వెళ్ళడం, వాళ్ళు ఏమీ చేయలేమని చేతులు ఎత్తేయడంతో సెన్సార్ వాళ్ళు వర్మకు ఝలక్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆయన కోర్టుకు వెళతానని ప్రకటించాడు, మళ్ళీ మా మధ్య అపార్ధాలు వచ్చాయి సమసి పోయాయి అని కవరింగ్ ఇచ్చాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇంకా సెన్సార్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమా విడుదల ఈనెల 22న లేనట్టే.   సెన్సార్ బోర్డు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని బుధవారం చూడబోతున్నట్టు తెలిసింది. బుధవారం సినిమా చూసినా శుక్రవారానికి సినిమా విడుదల చెయ్యడం కష్టం . ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ కనీసం వారం ముందు థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకోవాలి. సినిమా సెన్సార్ అవుతుందో కాదో  ఇప్పటిదాకా తెలియలేదు కాబట్టి బయ్యర్లు థియేటర్ లను సంప్రదించలేదు నిర్మాత. అయినా వర్మ ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ 22న విడుదల చేస్తానని చెబుతున్నాడు. ఇది జరిగే పని కాదు, సో వ‌ర్మ‌కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడం. కానీ అలా చేస్తే నిర్మాతలకి కొట్లలో లాస్ వస్తుంది. సో ఈ సినిమాని ఈనెల 29న విడుదల చెయ్యవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు. చూద్దాం ఆరోజుకి అయినా సినిమా వస్తుందేమో ?

More Related Stories