English   

రామ్ గోపాల్ వర్మను ఆవహించిన నందమూరి తారక రామారావు..

ram gopal varma look like a senior ntr due to his lakshmis ntr movie promotion
2019-03-18 14:46:08

అదేంటి ఎన్టీఆర్ వర్మ ఆవహించడం ఏంటి.. విచిత్రంగా అనుకుంటున్నారా.. ఇప్పుడు నిజంగా ఇదే జరిగింది. చనిపోయిన నందమూరి తారకరామారావు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మలో ఉన్నాడు. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వర్మ ఏదైనా చేస్తాడు అనేది నమ్మాలి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆనందంలో తేలి పోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను మార్చి 22 నుంచి 29కి వాయిదా వేశాడు. కచ్చితంగా 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వస్తుందని చెబుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇదిలా ఉంటే తన ట్విట్టర్లో సినిమా ప్రమోషన్ మాత్రం ఇంకా ఆపడం లేదు ఈ దర్శకుడు. రోజు రోజుకు కొత్త పద్ధతులు కనిపెట్టి మరీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ప్రేక్షకులకి తీసుకెళ్లి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు ఈ సంచలన దర్శకుడు. ఇందులో భాగంగానే ఇదివరకు బాలకృష్ణ వాయిస్ తో ఒక వీడియో విడుదల చేశాడు. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఎన్టీఆర్ బయోపిక్ చేయడం అంటూ బాలకృష్ణ వాయిస్ తోనే ఈ వీడియో విడుదలైంది. దానికి ముందు తన సినిమా ట్రైలర్ చూస్తున్నట్లు దేశ విదేశ ప్రముఖులతో ఫోటోలు మార్ఫింగ్ చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ మొహంలో తన మొహాన్ని మార్ఫింగ్ చేసి నేను ఎవరో చెప్పుకోండి అంటూ ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇదంతా చూస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని అన్నట్లుగా ఉంది. ఇప్పుడు చెప్పండి.. రాంగోపాల్ వర్మను నందమూరి తారకరామారావు ఆవహించాడా లేదా..

More Related Stories