English   

అల్లు అర్జున్ స్థానానికి ఎర్త్ పెడుతున్న విజయ్ దేవరకొండ..

Vijay-Devarakonda
2019-03-19 02:02:39

మనం చిన్నప్పుడు చదువుకున్న తాబేలు-కుందేలు కథ అంత ఈజీగా మరచిపోలేము. కుందేలు మొదటి ఫాస్ట్ గా వెళ్లి ఆ తర్వాత సేదతీరడానికి పడుకున్న సమయంలో నెమ్మదిగా తాబేలు తన పని తాను చేసుకుని చివరికి గెలుస్తుంది. ఈ కథలోని నీతి చాలా ఉంది. ముందు ఎంతో సాధించాం కదా అని కాస్త నీరసపడిన కూడా వెనక చాలా మంది పోటీలో గెలవడానికి పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇతర భాషల్లో అత్యధిక ఇమేజ్ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఆయనకు తెలుగుతో పాటు మలయాళంలోనూ కూడా అదిరిపోయే ఇమేజ్ ఉంది. ఇక తమిళనాట కూడా బాగానే గుర్తుపడతారు. కన్నడలో మెగా ఫ్యామిలీ కంచుకోట ఎలా ఉంది. దాంతో తెలుగు నుంచి చాలా త్వరగా సదరన్ స్టార్ అనిపించుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ మధ్య కాలంలో ఈయన నుంచి సరైన విజయం రాలేదు. దాంతో పోటీలో కాస్త వెనకబడిపోయాడు ఈ మెగా హీరో. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. ఇప్పటికే తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక తమిళనాట కూడా విజయ్ దేవరకొండ కు అదిరిపోయే మార్కెట్ ఉంది. మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు దృష్టి పెడుతున్నాడు ఈ అర్జున్ రెడ్డి. తాజాగా ఈయన నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాను తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. దీన్నిబట్టి విజయ్ దేవరకొండకు ఎంత ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత కచ్చితంగా ప్రతి సినిమాను మిగిలిన భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు విజయ్. అంతేకాకుండా నయనతార హీరోయిన్ గా ఒక భారీ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. మొత్తానికి చాలా తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలను అన్నింటిని దున్నేస్తున్నాడు విజయ్.

More Related Stories