English   

మరో హీరోయిన్ కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నాడు !

Bhagyashree
2019-03-19 02:39:53

అప్పట్లో వచ్చిన  ప్రేమ పావురాలు అదేనండీ బాలీవుడ్ మైనే ప్యార్‌ కియా డబ్ చేసిన సినిమా. తెలుగులో ప్రేమ పావురాలు, ఇంగ్లీషులో వెన్ లవ్ కాల్స్, తమిళంలో కాదల్ ఒరు కవితాయి, మలయాళంలో పావుకల్, స్పానిష్‌లో తే అమో ఇలా ఏ భాషలోకి డబ్ చేసిన వసూళ్ల వర్షం కురిపించింది ఆ బాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీ. ఈ సినిమాతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టార్ హీరో అయ్యాడు. ఆయనతో సమానంగా హీరోయిన్ భాగ్య శ్రీకి కూడా క్రేజ్ వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఆమె రాంగ్ స్టెప్స్ తీసుకుంది. పెళ్లి చేసుకోవడంతో ఆమె ఒకరకైమైన గిరి గీసుకున్నట్టు అయిపొయింది. ఆ తర్వాత కూడా ఆమెకి వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె ఆ తర్వాత కేవలం మూడు సినిమాలు అదీ తన భర్తతోనే ఆమె చేసారు. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది కదా, దని గురించి అనుకుంటున్నారా ? కాదండోయ్. ఇప్పుడు ఆమె తనయుడు అభిమన్యు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మర్ద్ కో దర్ద్ నహీ హోతా అనే సినిమాతో అయన హీరోగా లాంచ్ కానున్నాడు. ఈ సినిమాలో రాధికా మదన్, గుల్షన్ దేవయ్య, మహేష్ మంజ్రేకర్ వంటి వారు ఉన్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతోంది.

More Related Stories