English   

అమ్మానాన్న కోల్పోయిన బాలికను దత్తత తీసుకున్న మనోజ్ !

Manoj-Manchu
2019-03-19 04:38:52

ఈ మధ్య సినిమాలు ఏమీ లేక ఖాళీగా ఉంటున్న మంచు మనోజ్ ఆ మధ్య తాను పూర్తిగా సినిమాలు మానేస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపాడు. ముందు కాస్త ప్రేక్షకులు ఖంగారు పడినా ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నాడేమో అని సమాధాన పడ్డారు. అయితే అది కూడా ఖండించిన ఆయన జనం కోసం వారికి సేవ చేస్తూ బతుకుతానని ప్రకటించాడు. అప్పటి నుండి సంఘ సేవ అంటూ ఆయన తిరుగుతున్నారు. అయితే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నా, బయట మీడియా దృష్టిలో అయితే ఎప్పుడూ పడలేదు. అయితే తాజాగా ఆయన చేసిన పనితో మళ్ళీ వార్తల్ల్లోకి ఎక్కాడు. సిరిసిల్ల జిల్లాలో తల్లి తండ్రులను కోల్పోయిన చిన్నారి అశ్వితను దత్తత తీసుకున్నారు మనోజ్. ఆమె చదువుకునేంత వరకు ఒక అన్నలా ఉండి చదివిస్తానని ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన అశ్విత ఇటీవల తల్లి తండ్రులను కోల్పోయింది. అశ్వితకు ఇప్పటికే పలువురు సాయం అందించగా, ఇక నుండి అశ్వితను తన చెల్లెలుగా చూసుకుంటామని, ఇప్పటి నుండి తమ కుటుంబ సభ్యురాలిగా ఆమె ఉంటుందని తమ విద్యా సంస్థ(విద్య నికేతన్)లో ఉచితంగా చదువు అందిస్తామని పేర్కొన్నారు.  ఆమె చదవాలనుకున్న ఐఏఎస్ వరకూ చదివిస్తామని , నాన్న పుట్టిన రోజున ఈ పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మనోజ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

More Related Stories