English   

జపాన్ లో సంచలనం సృష్టిస్తున్న భళ్ళాల దేవ.. ఆనందంలో రానా ఫ్యాన్స్..

Rana
2019-03-19 04:42:51

బాహుబలి సినిమా కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు.. అలాగని ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. చాలా చోట్ల ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇండియాలోనే కాకుండా మిగిలిన దేశాలలో కూడా విజయదుందుభి మోగించాడు బాహుబలి. ఈ ఒక్క సినిమాతో రాజమౌళి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయాయి. అలా చేసుకున్నాడు ఈయన. ఇక ఈ సినిమాలో నటించిన పాత్రలు కూడా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా జపాన్లో బాహుబలి చాలా ఓన్ చేసుకున్నారు అక్కడి ప్రేక్షకులు.. విచిత్రంగా హీరో బాహుబలి పాత్ర కంటే కూడా ప్రతినాయకుడు అక్కడ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రానాకు అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వచ్చేశాయంటే నమ్మడానికి అతిశయోక్తి లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. గతంలో ఒకసారి బాహుబలి ప్రివ్యూ వేసినప్పుడు ప్రభాస్ కనిపించినప్పుడు కంటే కూడా రానా వచ్చినప్పుడే విజిల్స్ ఎక్కువగా పడ్డాయి. ఇప్పుడు కూడా జపాన్ రాజధాని టోక్యోలో ప్రత్యేకంగా రానా అభిమానుల కోసం బాహుబలి ప్రివ్యూ వేశారు. అక్కడ భల్లాలదేవుడు వచ్చినప్పుడు ఓ రేంజ్ లో అరుపులు కేకలు వేస్తూ దద్దరిల్లిపోయేలా చేశారు అభిమానులు. ఈ వీడియోను తీసి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది బాగా వైరల్ అయిపోతుంది. జపాన్ లో బల్లాల దేవుడి హంగామా అంటూ రానా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కేవలం రానా పాత్ర మాత్రమే కాదు సుబ్బరాజు పాత్రకు కూడా జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య ఒక సారి ఆయన అక్కడికి వెళ్లినప్పుడు అదే గెటప్ లో కనిపించి అభిమానులను అలరించాడు. మొత్తానికి ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణ లభించడం గొప్ప విషయమే. ఈ క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్ళిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Related Stories