English   

భీమవరం, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ..

Pawan-Kalyan
2019-03-19 06:36:20

రాబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడా అని చాలా రోజుల నుంచి ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. పెందుర్తి, గాజువాక, భీమవరం ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తేది కన్ఫర్మ్ చేయలేదు. తను జనరల్ బాడీ మీటింగ్ లో మేధావులతో కూర్చొని రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో సర్వే నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తే.. అందులో 8 స్థానాలు అగ్రస్థానంలో నిలిచాయి. వాటిలోంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకను ఎంచుకున్నాడు పవన్ కళ్యాణ్. పిఠాపురం, పెందుర్తి, ఇచ్చాపురం కూడా ఈ సర్వేలో నిలిచాయి. అయితే మేధావులు అంతా కలిసి పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో నిలబడాల్సిందిగా కోరడంతో ఆయన కూడా ఓకే అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అఫిషియల్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది జనసేన పార్టీ. పదేళ్ల కింద చిరంజీవి కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు. అప్పట్లో ఆయన పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేయగా పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో విజయం సాధించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి సై అంటున్నాడు. మరి గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఎంతగా ఆదరిస్తారో చూడాలి. ఒకవేళ రెండు చోట్ల గెలిస్తే ఏ నియోజకవర్గాన్ని ఆయన వదిలిపెడతాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం కచ్చితంగా ఏపీలో చాలా ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తన పార్టీని బలోపేతం చేయడానికి ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నాడు పవర్ స్టార్. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది.

More Related Stories