English   

బికినీలో చూడకపోతే కళ్ళు మూసుకోండి అంటున్న లక్ష్మీ రాయ్..

Lakshmi-Rai
2019-03-19 09:22:34

ఈ మధ్య వరుసగా బాలీవుడ్, కోలీవుడ్ లలో బిజీగా ఉన్న లక్ష్మీరాయ్ ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో బిజీ కావడానికి ట్రై చేస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ జాతకం మారలేదు. ఈ మధ్య వేర్ ఈజ్ వెంకటలక్ష్మి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

తాజాగా తమిళనాట లక్ష్మీరాయ్ నటించిన నియ 2 సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇది పూర్తిగా పాము నేపథ్యంలో సాగే సినిమా. ఒక పాము పగ పడితే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్ర కథ. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరిన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా బయటికి వచ్చిన లక్ష్మీ రాయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా పూర్తిగా పాము నేపథ్యంలో సాగుతుందని.. కథ బాగా నచ్చడంతో మరో ఆలోచన లేకుండా ఈ చిత్రం చేసినట్లు చెప్పింది లక్ష్మి. ఇదిలా ఉంటే కొందరు బరువు తగ్గితే అసలు బాగుండదని.. కానీ మీరు బరువు తగ్గిన తర్వాత కూడా చాలా బాగున్నారు అంటూ అభిమానులు చెబుతున్నారని.. అది విన్న తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది అంటుంది లక్ష్మీరాయ్. 

ఇక బికినీ ఫోటోల గురించి కూడా మాట్లాడింది. బీచ్ కి వెళ్లినప్పుడు బికినీ కచ్చితంగా వేసుకుంటారని.. అది చాలా కామన్.. దాన్ని అనవసరంగా భూతద్దంలో పెట్టి చూడొద్దు ఉంటుంది లక్ష్మీ రాయ్. తాను కూడా అలా వెళ్లినప్పుడు సెల్ఫీలు తీసుకోవడం ఒక సరదా అని.. ఒక వేళ మీరు బికినీలో తను చూడలేకపోతే కళ్ళు మూసుకోండి అంటూ సమాధానం చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఒక్క హిట్ కోసం ఎన్ని అందాలు ఆరబోయడానికైనా సిద్ధమేనంటోంది అంటోంది లక్ష్మీ రాయ్.

More Related Stories