English   

మోడీ బయోపిక్ ముందుగానే వస్తోంది !

Modi
2019-03-19 09:36:32

ప్రస్తుతం భారత ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో మేరీ కొమ్ లాంటి బయోపిక్ తీసిన ఒమంగ్ కుమార్ పీఎం నరేంద్రమోదీ అనే టైటిల్‌ తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమా ఏప్రిల్ 12న విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. కాని ప‌బ్లిక్ డిమాండ్ వ‌ల‌న చిత్రాన్ని వారం రోజుల ముందే రిలీజ్ చేస్తున్నామ‌ని నిర్మాతలు తాజాగా ప్రకటించారు. పబ్లిక్ డిమాండ్ అంటున్నారు కానీ ఈ సినిమా ముందే రిలీజ్ చేయమని బీజేపీ తరపున ఎవరైనా చెప్పి ఉండచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే దేశంలో మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. సినిమా అంతకు ముందే వస్తే ఏమైనా బీజేపీ లాభపడుతుందని వారు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 దేశ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ముంబైలో చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది

More Related Stories