English   

చిత్రలహరి పాట విడుదల.. మెగా మేనల్లుడి కోసం దేవి రచన..

Chitralahari
2019-03-19 11:20:30

సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రాలహరి సినిమా తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. పరుగు పరుగు అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ రాయడం విశేషం. మెగా మేనల్లుడు సినిమాకు తొలిసారి స్వరాలు అందిస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పటి వరకు మెగా కుటుంబంలో అందరి హీరోలతో పనిచేసిన దేవి.. సాయి ధరమ్ తేజ్ తో మాత్రం ఇన్ని రోజులు పని చేయలేక పోయాడు. ఇన్నాళ్లకు కిషోర్ తిరుమల ఈ కాంబినేషన్ కలిపాడు.

ఇప్పుడు విడుదలైన ఈ పాటను పూర్తిగా హీరో క్యారెక్టరైజేషన్ కు తగ్గట్లు రాసాడు దేవి శ్రీ. ఇందులో సాయి ధరంతేజ్ కు ఏది కలిసిరాదు. జీవితంలో బాగా వెనుకబడి పోయిన క్యారెక్టర్ ఇది. దానికి తగ్గట్లుగానే లిరిక్స్ అందించాడు దేవి శ్రీ ప్రసాద్. ఎంత వేగం పెంచిన లోకం తనను వెనక్కు వేసి వెళ్లిపోతుంది అంటూ ఈ పాటలో రాసాడు దేవి శ్రీ. దీన్నిబట్టి హీరో క్యారెక్టర్ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో కచ్చితంగా విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు మెగా మేనల్లుడు. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రలహరి. సునీల్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ రోల్ పోషిస్తున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు తనకు సరిపోయే పాత్ర రాలేదు. అయితే చిత్రలహరిలో మాత్రం కచ్చితంగా కడుపులు చెక్కలు చేసే క్యారెక్టర్ ఇది అంటున్నాడు సునీల్. మొత్తానికి ఈ సినిమాతో అటు సాయి ధరంతేజ్ కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలి.

More Related Stories