English   

పనోడైనా మనోడే.. ఆలియా భట్ దాతృత్వం !

Alia-Bhatt
2019-03-19 11:54:36

ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది మహేష్ భట్ కూతురు అలియా భట్. తనదైన అనడంతో అంతే అభినయంతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. ఈమె గతంలో చాలా ఇళ్ళు కొనుక్కుందని వార్తల్లోకి ఎక్కినా సంగతి గుర్తుండే ఉంటుంది, తనకి అలా ఇళ్ళు కొనుక్కోవడం ఇష్టం అని చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు చేసిన ఒక పని అందరినీ ముగ్ధులను చేస్తోంది. మన దగ్గర, మన ఇళ్ళల్లో పని చేసే పని మనుషులకి పండగలకి బోనస్ లు లాంటివి ఇవ్వాలంటేనే ఆలోచిస్తాం కదా, అంటే మన ఆర్ధిక పరిస్థితి అలా ఉంటుంది అనుకోండి. కానీ కోట్లు సంపాదించే వారు కూడా పని వాళ్ళ విషయంలో కఠినంగా ఉన్న ఉదంతాలు ఎన్నో విన్నాం, చూశాం. కానీ అలియా మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా తన కార్ డ్రైవర్ తో పాటు తన హెల్పర్ గా పని చేస్తోన మరో మహిళకి చెరో అరకోటి పెట్టి ఇల్లు కొనేసి ఇద్దరికీ గిఫ్ట్ ఇచ్చింది. తన దగ్గర చాలా కాలంగా చాలా నమ్మకంగా పనిచేస్తోన్న ఈ ఇద్దరికీ అలా గిఫ్ట్ ఇవ్వడం తనకి చాల సంతోషాన్ని ఇచ్చిందని చెబుతోంది అలియా. ఒకరికి జూహూ గల్లీలో మరొకరికి ఖార్ దండాలో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ళు కొనిపెట్టింది. అయితే వీరిద్దరూ ఆమె దగ్గర ఆమె మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది యియర్ నుండి పని చేస్తున్నారట.  
 

More Related Stories