English   

సమంతను వెనక్కి నెట్టిన సమ్మోహన సుందరి !

Aditi-Rao-Hydari
2019-03-19 12:20:05

హైదరాబాద్ లో పుట్టిన నిజాం కాలపు మంత్రుల వారసురాలు అదితీ రావు హైదరీ టాలీవుడ్ లోనే అధిక పాపులారిటీ ఉన్న సమంతకు షాకిచ్చింది. సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన అదితి  సమంతను వెనక్కి నెట్టింది తాను మొదటి స్థానం సంపాదించింది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా ? పాపులారిటీలోనే అండి. ఇదేంటా అనుకుంటున్నారా ? తాజాగా హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాను తాజాగా హైదరాబాద్ టైమ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో అదితిరావు హైదరి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మొత్తం 25 మంది మహిళా సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో సమంత మూడో స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా 2018 రన్నరప్‌గా నిలిచిన శ్రేయారావు కామవరపు ఈసారి రెండో స్థానాన్ని ఆక్రమించింది. పూజా హెగ్డే, రష్మిక మందన వరసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే అసలు ఇండస్ట్రీతో సంబంధం లేని మిస్ హైదరాబాద్ 2018 కామాక్షి ఆరో స్థానంలో అది కూడా రకుల్, కైరా అద్వానీ, కాజల్ లాంటి హీరోయిన్స్ ని వెనక్కు నెట్టి మరీ సాదించడం.
టాప్ 25 లిస్ట్ 
1. అదితిరావు హైదరి 
2. శ్రేయారావు కామవరపు 
3. సమంత అక్కినేని 
4. పూజా హెగ్డే 
5. రష్మిక మందన 
6. కామాక్షి భాస్కర్ల 
7. పీవీ సింధు 
8. కైరా అద్వానీ 
9. రకుల్ ప్రీత్ సింగ్ 
10. కాజల్ అగర్వాల్ 
11. పాయల్ రాజ్‌పుత్ 
12. బ్రాహ్మణి 
13. రిషిత కొరుటూరు 
14. రేహా సుకేజా 
15. నిధి అగర్వాల్ 
16. అనుష్క శెట్టి 
17. ప్రియాంక జవాల్కర్ 
18. సాయి పల్లవి 
19. మిథాలి రాజ్ 
20. భూమి శెట్టి 
21. కీర్తి సురేష్ 
22. సైనా నెహ్వాల్ 
23. అదా శర్మ 
24. అదితి సొనాలి తివారీ 
25. తమన్నా భాటియా 

More Related Stories