English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవద్దని కోర్టు సంచలన తీర్పు..

lakshmis ntr
2019-03-19 13:19:06

రాంగోపాల్ వర్మ న్యాయపోరాటం గెలిచింది. ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎవరూ అడ్డుకోకూడదు అంటూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై తెలుగు ఇండస్ట్రీలో నానాయాగీ నడుస్తుంది. తెలుగుదేశం కార్యకర్తలు ఈ సినిమాను విడుదల చేయకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పూర్తి నెగిటివ్ ఛాయలతో చూపించారని.. ఇది విడుదలైతే ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో ఎన్నికల కమిషన్ ఈ సినిమాను ఎలక్షన్స్ తర్వాత విడుదల చేసుకోవాలంటూ చెప్పడంతో రామ్ గోపాల్ వర్మ న్యాయ పోరాటానికి దిగారు. ఇంతలోనే సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాను సెన్సార్ చేయమంటూ చెప్పేసరికి మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటానన్నాడు వర్మ.

అయితే ఏమైందో ఏమో మరి రాత్రికి రాత్రే సెన్సార్ బోర్డు మాట మార్చేసింది. ఈ సినిమా సెన్సార్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు కోర్టు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని.. వాళ్ల భావ ప్రకటన హక్కు అడ్డుకుంటే అది నేరం అవుతుంది అంటూ కోర్టు చెప్పింది. అందులో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుదే అని.. విడుదలైన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మార్చి 22న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29కి వాయిదా పడింది. మరి ఇప్పుడు ఎన్ని సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఏం చేస్తుందో చూడాలి.

More Related Stories